India: భారత వృద్ధి తగ్గిపోతోంది.. అంచనా కంటే తక్కువగా నమోదవుతోంది!: ఐఎంఎఫ్

  • ఆర్థిక మందగమనం దిశగా దేశం
  • ఈ ఏడాది వృద్ధి 7 శాతమేనన్న ఐఎంఫ్
  • భారత వృద్ధిని 6.9 శాతానికి పరిమితం చేసిన క్రిసిల్

భారత ఆర్థిక వృద్ధిపై గతంలో సానుకూల నివేదికలు ఇచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా బాంబు పేల్చింది. భారత వృద్ధి అంచనా కంటే తక్కువగా నమోదవుతోందని ఐఎంఎఫ్ తెలిపింది. కార్పొరేట్, పర్యవరణ నియంత్రణల విషయంలో అనిశ్చితి, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్ బీఎఫ్ సీ)లు బలహీనపడటం కూడా మందగమనానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని వెల్లడించింది.

అయితే అమెరికా, చైనాతో పోల్చుకుంటే భారత్ వేగవంతమైన వృద్ధి రేటును నమోదు చేస్తోందని అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో నివేదిక విడుదల చేసిన ఐఎంఎఫ్ 2019లో భారత వృద్ధి 7 శాతం, 2020లో 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. మరో రేటింగ్ సంస్థ క్రిసిల్ భారత వృద్ధిని 6.9 శాతానికి పరిమితం చేసింది.

More Telugu News