Warangal Urban District: ఆలయంలోని రావి చెట్టు నరికివేత... 'కన్నీరు' పెడుతోందంటున్న భక్తులు!

  • వరంగల్ జిల్లాలో ఘటన
  • హనుమాన్ ఆలయంలో పూజలందుకుంటున్న రావి చెట్టు
  • తండోపతండాలుగా వస్తున్న భక్తులు
ప్రజలు భక్తితో పూజించే ఓ రావి చెట్టును గుర్తు తెలియని కొందరు నరికివేయగా, మిగిలిన మొండెం నుంచి నీరు కారుతున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో జరిగింది. నరికి వేయబడిన రావి చెట్టు నుంచి నీరు కారుతోందని తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

దానిని చూసిన భక్తులు, చెట్టు కన్నీరు పెడుతోందని, ఇది హనుమంతుని మహిమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టును భక్తులు పరమ పవిత్రంగా భావిస్తూ, పూజలు చేస్తుంటారు. అటువంటి చెట్టును నరికి వేయడంపై భక్తుల్లో ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. నిందితులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Warangal Urban District
Vardhannapeta
Hanuman Temple
Ravi Chettu

More Telugu News