New Delhi: ట్రక్కులో ఓవర్‌లోడ్.. రూ. 2 లక్షల జరిమానా విధించిన ఢిల్లీ పోలీసులు

  • సామర్థ్యానికి మించి లోడు
  • కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో జరిమానా ఇదే తొలిసారి
  • ఢిల్లీలో ఘటన
సామర్థ్యానికి మించిన లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ముబారక్ చౌక్ సమీపంలో ఓవర్ లోడుతో వెళ్తున్న ట్రక్కును గుర్తించిన పోలీసులు దానిని అడ్డుకున్నారు. అనంతరం ఓవర్ లోడుతో పాటు మరో తొమ్మిది ఉల్లంఘనలకు గాను రెండు లక్షల ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి.

రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో వాహన చట్టానికి సవరణలు చేసిన కేంద్రం ఈ నెల 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే,  కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నాయి.
New Delhi
truck
traffic police
fine

More Telugu News