Jagan: 'రైతు భరోసా'కు నిజమైన లబ్ధిదారులను గుర్తించమంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

  • అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న వైయస్సార్ రైతు భరోసా పథకం
  • మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
  • రైతు భరోసా పథకం కేవలం అర్హులకు మాత్రమే అందాలి

ఏపీలో అక్టోబర్ 15వ తేదీ నుంచి వైయస్సార్ రైతు భరోసా పథకం అమలుకాబోతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ ఈ పథకం అందాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని సూచించారు.

రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వెబ్ లాండ్ జాబితాను పంచాయతీలవారీగా పరిశీలించి... ఆ జాబితాలో ఉన్నవారు నిజమైన రైతులో, కాదో గుర్తించాలని ఆదేశించారు. విదేశాల్లో ఉంటూ వ్యవసాయం చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను చేపల చెరువులు, రియలెస్టేట్ గా మార్పిడి చేసిన వారికి, వ్యవసాయం చేయని వారికి ఈ పథకం కింద లబ్ధి కలగకూడదని అన్నారు.

More Telugu News