Andhra Pradesh: రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు: మంత్రి కన్నబాబు

  • అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తప్పవు 
  • మార్క్ ఫెడ్ నుంచి డీలర్లకు యూరియా సరఫరా ఆపివేశాం
  • 39 మంది ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులను భర్తీ చేస్తాం

ఏపీలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కొందరు వ్యాపారులు కావాలనే యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు.
ఉద్యాన వన శాఖపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఉద్యానవన పంటలను ఈ ఏడాది మరో లక్ష ఎకరాలకు పెంచాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు.

గత ఏడాది కంటే అరటి, మామిడి ఎగుమతులను కూడా పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 39 మంది ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. మార్క్ ఫెడ్ నుంచి డీలర్లకు యూరియా సరఫరా ఆపివేశామని, అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా డిమాండ్ గతంలో కంటే పెరిగిందని, అవసరమైన మేరకు యూరియా తెప్పించేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నట్టు చెప్పారు.

More Telugu News