Khairatabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి

  • హుస్సేన్ సాగర్ లో ముగిసిన నిమజ్జనం
  • ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • భక్తుల జయజయ ధ్వానాల మధ్య ముగిసిన కార్యక్రమం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ముగిసింది. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య హుస్సేన్ సాగర్ లో శ్రీద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. మహాగణపతి విగ్రహం 61 అడుగుల ఎత్తు, 45 టన్నులకు పైగా బరువుంది. ఈ భారీ గణపతి కోసం హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నంబర్ 6 వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ ప్రాంతంలో నీటి లోతు 20 అడుగులకు పైగా ఉంది. ఈ ప్రాంతంలో భారీ క్రేన్ సహాయంతో మహాగణపతిని నిమజ్జనం చేశారు.
Khairatabad
Ganesh

More Telugu News