Jagan: బడ్జెట్ పై కేసీఆర్ కు ఉన్న అంచనాలు కూడా జగన్ కు లేవు: గోరంట్ల బుచ్చయ్యచౌదరి

  • తుగ్లక్ కొన్ని మంచి పనులైనా చేశాడు
  • కేంద్రం మొట్టికాయలు వేసిన తర్వాత పీపీఏలపై వెనక్కి తగ్గారు
  • ఛలో ఆత్మకూరును భగ్నం చేయడంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తాం
తుగ్లక్ కొన్ని మంచి పనులైనా చేశాడని... ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇంత వరకు ఒక్క మంచి పని కూడా చేయలేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేసిన తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జగన్ ప్రభుత్వం వెనకడుగు వేసిందని అన్నారు. ఒక్క జిల్లాలోనే సన్న బియ్యాన్ని ఇవ్వలేనివారు... 13 జిల్లాలకు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయడంపై సుప్రీంకోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అంచనాలు కూడా జగన్ కు లేవని ఎద్దేవా చేశారు.
Jagan
Gorantla Butchaiah Chowdary
KCR
Telugudesam
YSRCP
TRS

More Telugu News