constable results: విపక్ష తెలుగుదేశం పార్టీ ‘ఛలో ఆత్మకూరు’పై సీఎం జగన్ ఆరా

  •  హోంమంత్రి , డీజీపీలతో సమీక్ష
  • రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చ
  •  ఇతర అంశాలపైన డిస్కషన్

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష తెలుగుదేశం పార్టీ  నిన్న చేపట్టిన ’ఛలో ఆత్మకూరు‘ పోరాటంపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ టీడీపీ అధినేత ఛలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అలర్టయిన పోలీసులు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసి ఆత్మకూరు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం తనను కలిసేందుకు వచ్చిన హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌లతో ‘ఛలో ఆత్మకూరు’ అంశంపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. కార్యక్రమంలో భాగంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.  అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.  

More Telugu News