KTR: కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన మహేశ్ బాబు, ప్రభాస్!

  • జ్వరాల బారిన పడుతున్న ప్రజలు
  • జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ ట్వీట్
  • అప్రమత్తత అవసరమన్న మహేశ్
ఇటీవలి వర్షాలకు, జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రుల బారిన పడుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగగా, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ కు ప్రముఖ సెలబ్రిటీల నుంచి స్పందన వచ్చింది. వైరల్ జ్వరాలు లేదా డెంగీ తదితర వ్యాధులు సోకకుండా ఉండాలంటే, ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరని, నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీటిని నిల్వ చేయద్దని కేటీఆర్ సూచించారు.

తన ఇంటిని తనిఖీ చేసి, నిల్వ ఉన్న నీటిని తొలగించానని చెబుతూ ఫోటోలను షేర్ చేసుకున్నారు. దీనిపై టాలీవుడ్ యువ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ స్పందించారు. "హైదరాబాద్ నగర వాసులారా..." అంటూ కేటీఆర్ ప్రస్తావించిన విషయాలను మహేశ్ ప్రస్తావించారు. అప్రమత్తంగా ఉంటూ, ఎవరి గురించి వారే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
 
KTR
Mahesh Babu
Prabhas
Twitter
Rains
Fever

More Telugu News