Vikarabad District: పెళ్లికి అంగీకరించని పెద్దమ్మ.. ప్రియుడితో కలిసి తనువు చాలించిన ప్రియురాలు

  • వికారాబాద్ జిల్లాలో ఘటన
  • పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య
  • ప్రియుడిపై కిడ్నాప్ కేసు పెట్టడంతో మనస్తాపం
ప్రేమించిన యువకుడితో పెళ్లికి అంగీకరించకపోవడంతోపాటు ప్రియుడిపై తన పెద్దమ్మ కిడ్నాప్ కేసు పెట్టడంతో మనస్తాపం చెందిన యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల సమీపంలోని ముజాద్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. రావిల్యాకు చెందిన మల్లేశ్ (21)- అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. అయితే, బాలికను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలిసి నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన బాలిక పెద్దమ్మ మల్లేశ్‌పై కిడ్నాప్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమికుల కోసం గాలిస్తుండగానే పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
Vikarabad District
lovers
suicide

More Telugu News