7 టెర్రర్ లాంచ్ పాడ్ లలో 275 మంది ఉగ్రవాదులను సిద్ధం చేసిన పాకిస్థాన్!
- ఆఫ్గన్, ఫుష్తన్ కు చెందిన ఉగ్రవాదులను సిద్ధం చేసిన పాక్
- సరిహద్దులకు దగ్గర్లోనే ఉగ్ర శిబిరాలు
- పసిగట్టిన భారత నిఘా వర్గాలు
ఇండియాలో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో అశాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పాక్ ప్రణాళికలు రూపొందిస్తోందని, అందులో భాగంగా ఐఎస్ఐ ఇటీవల ఉగ్రవాద సంస్థలతో ప్రత్యేకంగా చర్చలు సాగించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు, సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ ప్రాంతం ద్వారా చొరబాటుకు యత్నిస్తోంది. గురేజ్ ప్రాంతంలో 80, మంచాల్ సమీపంలో 60, కర్నాహ్ లో 50, కరేన్ లో 40, యూరీ సమీపంలో 20, నౌగామ్ లో 15, రాంపూర్ సమీపంలో 10 మంది ఉగ్రవాదులను ఉంచిన పాక్, అక్కడ ఉగ్ర క్యాంపులను నిర్వహిస్తోందని, వారికి పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు కొందరు స్వయంగా శిక్షణ ఇస్తున్నారని తెలుస్తోంది.