Bengalore: విపరీతమైన తలనొప్పి వస్తోందని... 15 మాత్రలు మింగిన మహిళ మృతి!

  • బెంగళూరులో ఘటన
  • డాక్టర్ రాసిన మాత్రలను ఒకేసారి వేసుకున్న మహిళ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

విపరీతంగా ఉన్న తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందాలన్న ఉద్దేశంతో ఒకేసారి 15 మాత్రలు మింగిన మహిళ మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మునేషప్ప అనే రోజు కూలీ భార్య అనసూయమ్మ (45) తలనొప్పిగా ఉందని ఇటీవల వైద్యుని వద్దకు వెళ్లడంతో, డాక్టర్ మందులు రాసిచ్చాడు.

విపరీతంగా తలనొప్పి వస్తోందంటూ, ఆమె ఆ మాత్రలన్నీ ఒకేసారి వేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను గమనించిన కుమార్తె శోభ, హుటాహుటిన సమీపంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అసహజ మరణం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News