gold price down: బంగారం ధర పెరుగుదలకు బ్రేక్‌.. ఒకే రోజు రూ.1500 డౌన్‌

  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఢిల్లీ మార్కెట్లో రూ.39,225
  • అంతర్జాతీయ మార్కెట్లో ధర పతనం ప్రభావం
  • ఔన్స్‌ బంగారం 1494 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గణనీయంగా తగ్గడంతో ఆ ప్రభావం నిన్న రిటైల్‌ మార్కెట్‌లోనూ కనిపించింది. ముందు రోజుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఢిల్లీ మార్కెట్లో 39,225 రూపాయలకు అమ్ముడుపోయింది. ఒకే రోజు 1500 రూపాయల తగ్గుదల నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో వారం రోజుల వ్యవధిలో ధర నాలుగు శాతం పతనమైంది.  నిన్న బంగారం  ఔన్స్‌ ధర 1494 డాలర్లుగా నమోదయ్యింది. ఇది నెలరోజుల కనిష్ట ధరగా మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

 షేర్‌ మార్కెట్‌ పుంజుకోవడంతో బంగారం నుంచి పెట్టుబడులు అటువైపు మళ్లడమే దీనికి కారణం. వెండి ధర కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజే 8 శాతం పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 47వేల 405గా నమోదైంది. బంగారం వెండి ధర పతనానికి అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడడం కూడా మరో కారణం. ఈ ఏడాది బంగారం ధర 20 శాతం వరకు పెరిగింది. ఇప్పుడు ధర తగ్గుతుండడంతో దసరా, దీపావళి సీజన్లలో రిటైల్ అమ్మకాలు జోరుగా సాగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.
gold price down
international market effect
delhi

More Telugu News