Kinjarapu Acchamnaidu: మేము జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే: అచ్చెన్నాయుడు

  • మీ ప్రభుత్వ పని తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారు
  • పోలీసులు అన్నీ తెలుసుకుని వ్యవహరించాలి
  • సోషల్ మీడియాలో అభిప్రాయాలను చెప్పేవారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు
మీ ప్రభుత్వ పని తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారని వైసీపీపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. చరిత్రలో ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. అధికారంలో ఉండి బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం సిగ్గు చేటని చెప్పారు. తమ కార్యకర్తలను రక్షించుకోవడానికి జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని అన్నారు. తాము యుద్ధానికి వెళ్లడం లేదని... బాధితులను వాళ్ల ఇళ్లకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పోలీసులు అన్ని విషయాలు ఆలోచించుకుని వ్యవహరించాలని... లేకపోతే ఇబ్బంది పడతారని అన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలను చెప్పేవారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను తెలియజేసే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.
Kinjarapu Acchamnaidu
Telugudesam
YSRCP

More Telugu News