Lavanya Tripathi: 'కులం' ట్వీట్ తొలగింపుపై వివరణ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

  • బ్రాహ్మణులపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలు
  • కులం ఆధారంగా గొప్పవాడివి కాలేవు అంటూ స్పందించిన లావణ్య
  • కొద్దిసేపటికే తన ట్వీట్ తొలగించిన టాలీవుడ్ భామ
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బ్రాహ్మణుల విశిష్టత గురించి చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి బదులిచ్చిన సంగతి తెలిసిందే. "కులం ఆధారంగా గొప్పవాడివి కాలేవు" అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే, కొద్దిసేపటికే తన ట్వీట్ ను తొలగించింది. దీనిపై తాజాగా వివరణ ఇచ్చింది. "నా అభిప్రాయాలను బలంగా వినిపించే క్రమంలో ఎవరి మనోభావాలను గాయపర్చడం నా ఉద్దేశం కాదు. అందుకే ఆ ట్వీట్ తొలగించాను. ట్వీట్లు కొన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తాయి. కులం కంటే మనం చేసే మంచిపనులే గుర్తింపునిస్తాయని నేను నమ్ముతాను" అంటూ ట్విట్టర్ లో స్పందించింది.
Lavanya Tripathi
Om Birla
Tollywood

More Telugu News