Srisailam: తన భార్యతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తించిన సూపరింటెండెంట్ ఇంజినీరు!

  • కృష్ణా నదికి భారీగా వరదలు  
  • సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు
  • స్విచాన్ చేసి రెండు గేట్లు ఎత్తిన ఎస్ఈ భార్య

భారీ నీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎంతో క్లిష్టమైన వ్యవహారం. నీటిని నిల్వ చేయడం, దిగువకు విడుదల చేయడం, వరద నీటి నియంత్రణ తదితర కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రతి డ్యామ్ కు సుశిక్షితులైన ఇంజినీర్ల బృందం ఉంటుంది. అయితే, శ్రీశైలం డ్యామ్ వద్ద ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

వరద నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో ఏపీ జలవనరుల శాఖ ఇన్ చార్జి సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ) శ్రీనివాసరెడ్డి తన భార్యతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను స్విచాన్ చేయించి ఎత్తించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సుంకేసుల, జూరాల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో ఆ వరద ప్రవాహమంతా శ్రీశైలం చేరుకుంటోంది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించి ఎస్ఈ భార్యతో రెండు గేట్లు ఎత్తించారు. ఈ చర్య విమర్శల పాలవుతోంది.

  • Loading...

More Telugu News