Galla Jaydev: పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉంటే 144 సెక్షన్ ఎందుకు విధించినట్టు?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గల్లా జయదేవ్

  • పల్నాడులో పరిస్థితి అదుపులో ఉందన్న రాష్ట్ర హోం మంత్రి
  • పల్నాడులో 144 సెక్షన్ విధించామని చెప్పిన డీజీపీ
  • ట్విట్టర్ లో స్పందించిన గల్లా జయదేవ్
పల్నాడులో పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించగా, పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ చెబుతుండడం పట్ల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉంటే  144 సెక్షన్ ఎందుకు విధించారని జయదేవ్ ప్రశ్నించారు. రేపు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నిర్వహించ తలపెట్టిన 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే 144 సెక్షన్ విధించారా?అని నిలదీశారు. పల్నాడులో తమ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తెలిసిందే. ఈ క్రమంలోనే 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ప్రకటించారు.
Galla Jaydev
Telugudesam
YSRCP
Andhra Pradesh
Palnadu

More Telugu News