Chinta Mohan: హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది: చింతా మోహన్

  • తిరుపతి ఏపీ రాజధాని కావడం ఖాయం
  • రాజధానిగా తిరుపతి అన్ని విధాలా సరైంది
  • అమరావతిని వదిలి జగన్ తిరుపతికి రావాలి
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి తనకు రహస్య సమాచారం అందిందని చెప్పారు. మరోపక్క, తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడం ఖాయమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతిని వదిలి తిరుపతికి రావాలని సూచించారు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అన్ని విధాలా అనువైనదని చెప్పారు.

అమరావతికి వరద ముప్పు ఉందని... రాజధానిగా ఆ ప్రాంతం అనువైనది కాదని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చింతా మోహన్ పైవ్యాఖ్యలు చేశారు.
Chinta Mohan
Jagan
Tirupati
Capital
Andhra Pradesh
YSRCP
Congress

More Telugu News