Priyavrata: 'మహాపరీక్ష'లో ఉత్తీర్ణుడయిన 16 ఏళ్ల బాలుడు... అద్భుతమంటూ మోదీ ట్వీట్!

  • శాస్త్రాలు ఔపోసన పట్టిన ప్రియవ్రత
  • 14 లెవల్స్ లో ఉత్తీర్ణత 
  • ఎంతో మందికి ఆదర్శుడన్న మోదీ
అర్చక, ఆగమ వృత్తిలో అత్యధిక స్థాయి పరీక్ష అయిన 'మహా పరీక్ష'లో 16 ఏళ్ల వయసులోనే ఉత్తీర్ణుడయిన ప్రియవ్రత అనే బాలుడిని ప్రధాని నరేంద్ర మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. వేదాలను, వ్యాకరణ మహా గ్రంథాలను చిన్న వయసులోనే అభ్యసించిన దేవదత్త పాటిల్, అపర్ణ దంపతుల బిడ్డ ప్రియవ్రత, 14 లెవల్స్ ఉత్తీర్ణుడయిన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించగా, ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ, తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. ఈ ఘనత సాధించిన ప్రియవ్రతకు ప్రధాని శుభాకాంక్షలు చెబుతూ, అతని విజయం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఇది అద్భుతమన్నారు. కాగా, శాస్త్రాలు చదివే విద్యార్థులకు 14 స్థాయుల్లో పరీక్షలు ఉంటాయి.
Priyavrata
Mahapariksha
Narendra Modi
Twitter

More Telugu News