syera: రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఆసక్తికర ఫొటో!

  • ప్రముఖ హీరో చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’
  • తన తండ్రి మేకప్ ను చూస్తూ గడ్డం పట్టుకున్న చెర్రీ
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఫొటో

ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి నిర్మాతగా చిరు తనయుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర ఫొటోను చెర్రీ పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ‘సైరా’ గెటప్ లో ఉన్న తన తండ్రి మేకప్ ను చూస్తూ, ఆయన గడ్డం పట్టుకుని రామ్ చరణ్ కనిపించాడు. ‘సైరా’ కోసం తన తండ్రి మారిన తీరు ఓ చక్కని అనుభవం అని, ఆయనకు నిర్మాతగా మారిన తర్వాతే ‘రియల్ మెగాస్టార్’ను తాను కలిశానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

More Telugu News