chandrayan-2: విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించిన ఇస్రో

  • చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించాం
  • ల్యాండర్ నుంచి ఆర్బిటర్ కు, గ్రౌండ్ స్టేషన్స్ కు కమ్యూనికేషన్ రాలేదు
  • ల్యాండర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు  యత్నిస్తున్నాం: శివన్ 

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఆర్బిటర్ గుర్తించిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఉన్న ప్రదేశాన్ని తాము గుర్తించామని, ఇందుకు సంబంధించిన థర్మల్ ఇమేజ్ ను ఆర్బిటర్ తీసి పంపిందని చెప్పారు. ల్యాండర్ నుంచి ఆర్బిటర్ కు గానీ, గ్రౌండ్ స్టేషన్స్ కు గానీ కమ్యూనికేషన్ రాలేదని తెలిపారు.

ల్యాండర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కమ్యూనికేట్ అవుతామని శివన్ అన్నారు. కాగా, గత శుక్రవారం చంద్రయాన్-2 ల్యాండింగ్ లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. చంద్రుడికి చాలా తక్కువ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ల్యాండర్ నుంచి ఆర్బిటర్, గ్రౌండ్ స్టేషన్స్ కు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై స్థిరమైన కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ తో ల్యాండర్ జాడను ఇస్రో కనిపెట్టింది.

More Telugu News