తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

08-09-2019 Sun 16:19
  • కొలువు దీరనున్న కొత్త మంత్రి వర్గం
  • కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్
  • తొలుత ప్రమాణస్వీకారం చేసిన హరీశ్ రావు

తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రారంభమైంది. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సమక్షంలో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత తన్నీరు హరీశ్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కొత్త మంత్రులకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.