Andhra Pradesh: జగన్మోహన్ రెడ్డి గారు! మీరిచ్చిన నాణ్యమైన బియ్యాన్ని మీరు, మీ మంత్రులు ఒక్కసారైనా తినగలరా?: బుద్ధా వెంకన్న

  • పంపిణీ చేసింది నాణ్యమైన బియ్యం కాదు
  • ‘మాకొద్దీ బియ్యం’ అని శ్రీకాకుళం ప్రజలు అంటున్నారు
  • ఆ బియ్యాన్ని వాలంటీర్లకు తిరిగి ఇచ్చేస్తున్నారు

ఏపీలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బియ్యంలో నాణ్యత లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల పురుగులు పట్టిన బియ్యం, మరికొన్ని చోట్ల తడిసిన బియ్యం పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ, పంపిణీ చేసింది నాణ్యమైన బియ్యం కాదని, ముక్కవాసన వస్తున్నాయని ఆరోపించారు. ‘శ్రీకాకుళం ప్రజలు బాబోయో మాకు ఈ బియ్యం వద్దు’ అని అంటున్నారని, ఆ బియ్యాన్ని వాలంటీర్లకు తిరిగి ఇచ్చేస్తున్నారని విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన నాణ్యమైన బియ్యాన్ని మీరు, మీ మంత్రులు ఒక్కసారైనా తినగలరా?’ అని ప్రశ్నించారు. ‘‘నవరత్నాలు’లో రెండు రత్నాలను రాళ్లు చేశారు. మూడు వేల పింఛన్ అని రూ.250 పెంచారు. అది (పింఛన్) రాయి అయిపోయింది.  ముక్క వాసన వచ్చే సన్నబియ్యంలో రాళ్లు కలిపారు. రత్నాలు కలుపుతారనుకుని అందరూ తీసి చూస్తే అందులో రాళ్లు ఉన్నాయి. ‘నవరత్నాలు’ లో రెండు రత్నాలు రాళ్లు, ఇంకా ఏడు రాళ్లు ఎప్పుడు ఇస్తారు?’ అని సెటైర్లు విసిరారు.

  • Loading...

More Telugu News