Zommotto: పది శాతం ఉద్యోగులను ఇంటికి పంపిన జొమాటో : 541 మంది ఔట్‌

  • ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టినట్టు ప్రకటన
  • అందుకే తొలగించినట్టు స్పష్టీకరణ
  • ఇంకా సంస్థలో 5 వేల మంది ఉద్యోగులు

ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌  (ఏఐ) ఆధారిత బాట్స్‌, ఆటోమేషన్‌ టెక్నాలజీతో కస్టమర్లకు దగ్గర కావాలని భావిస్తున్న ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, రెస్టారెంట్‌ డిస్కవరీ ప్లాట్‌ఫాం సంస్థ జొమాటో 10 శాతం మంది ఉద్యోగులపై వేటేసింది. గుర్గావ్‌లోని జొమాటో ప్రధాన కార్యాలయంలో కస్టమర్‌, వ్యాపార, డెలివరీ భాగస్వామిక సహాయక బృందంలోని 541 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

తొలగించిన ఉద్యోగులకు రెండు నెలల వేతనంతోపాటు జనవరి 2020 వరకు ఫ్యామిలీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం అందిస్తున్నామని తెలిపింది. ఉద్యోగులను తగ్గించిన తర్వాత ప్రస్తుతం జొమాటాలో ఇంకా 5 వేల మంది పనిచేస్తున్నారు.

More Telugu News