US OPEN: యూఎస్ ఓపెన్ లో సెరేనాకు షాక్.. కప్పును ఎగరేసుకుపోయిన 19 ఏళ్ల కెనడా అమ్మాయి!

  • సెరేనాను ఓడించిన బియాంక
  • 6-3, 7-5 సెట్లతో ఘనవిజయం
  • కప్పును కొట్టిన తొలి కెనడియన్ గా రికార్డు

దూకుడు ముందు అనుభవం తలవంచింది. న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ లో సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్, టోర్నీ ఫేవరట్ సెరేనా విలియమ్స్ పై కెనడియన్ స్టార్ బియాంక ఆండ్రిస్యూ(19) సంచలన విజయం సాధించింది. న్యూయార్క్ లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ లో బియాంక సెరేనాపై 6-3, 7-5 సెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. 

ఈ విజయంతో యూఎస్ ఓపెన్ గెలుచుకున్న తొలి కెనడియన్ గా చరిత్ర సృష్టించింది. గత రెండేళ్లలో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేందుకు అర్హత కూడా పొందలేకపోయిన బియాంక, ఈసారి ఏకంగా యూఎస్ ఓపెన్ కప్ ను ఎత్తుకుపోయింది. మరోవైపు ఈ టోర్నీలో విజయంతో ఏడో యూఎస్ ఓపెన్ కప్ ను దక్కించుకోవాలన్న సెరేనా ప్రయత్నం నెరవేరలేదు. సెరేనా ఖాతాలో ప్రస్తుతం 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. మరోటి గెలిస్తే  ఆల్ టైం గ్రేట్ మార్గరెట్ కోర్ట్ రికార్డును సెరేనా సమం చేసే అవకాశముంది.

More Telugu News