Telangana: తెలంగాణ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన తమిళి సై సౌందరరాజన్!

  • తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా రికార్డు
  • ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ చౌహాన్
  • అభినందనలు తెలిపిన కేసీఆర్, కిషన్ రెడ్డి, దత్తన్న
తెలంగాణ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన బీజేపీ నేత తమిళి సై సౌందరరాజన్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఆర్.ఎస్.చౌహాన్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నవ తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా తమిళి సై చరిత్ర సృష్టించారు. దాదాపు 9 సంవత్సాలకు పైగా తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళి సై గవర్నర్ గా వచ్చారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, తెలంగాణ మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళి సైకి పుష్పగుచ్ఛం అందించిన కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Telangana
KCR
governor
Tamilisai Soundararajan
Rajbhavan
Oath taking cermony

More Telugu News