ramjetmalani: అనారోగ్యంతో సీనియర్‌ న్యాయవాది రామ్ జెఠ్మలానీ మృతి

  • ఈరోజు ఉదయం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన  న్యాయ కోవిదుడు
  • కేంద్ర మంత్రిగా, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా పలు కీలక పదవులు
  • ముంబయిలో జన్మించిన  జెఠ్మలానీ
న్యాయవాదిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్న సీనియర్‌ లాయర్‌, కాంగ్రెస్‌ నేత రామ్‌ జెఠ్మలానీ (95) ఈ ఉదయం  ఢిల్లీలో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ న్యాయ కోవిదుడు ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశంలో పేరెన్నికగన్న న్యాయవాదుల్లో ఒకరైన జెఠ్మలానీ 1923, సెప్టెంబరు 14న ముంబయిలో జన్మించారు.

ఏడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న ఆయన ఎన్నో వివాదాస్పద కేసు వాదించారు. అరుణ్‌ జైట్లీ-కేజ్రీవాల్‌ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ తరపున వాదించారు. వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ramjetmalani
New Delhi
expaired
mumbai

More Telugu News