ISRO: విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాల కోసం మరో 14 రోజులు ప్రయత్నిస్తాం: ఇస్రో చైర్మన్ వెల్లడి

  • మీడియా ముందుకు వచ్చిన ఇస్రో చైర్మన్ శివన్
  • చివరి దశ సరైన రీతిలో సాగలేదని వివరణ
  • విక్రమ్ ల్యాండర్ తో సంబంధాల పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని వెల్లడి

భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైంది.  చంద్రుని ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అనుకోని రీతిలో మొరాయించింది. లేకుంటే చంద్రయాన్-2 ద్వారా భారత కీర్తిపతాక విశ్వవీధిలో మరోసారి రెపరెపలాడేది. ఈ ప్రయోగం తీరుతెన్నులపై ఇస్రో చైర్మన్ శివన్ స్పందించారు. మీడియా ముందుకొచ్చిన ఆయన ఈ ప్రక్రియ చివరి నిమిషాల్లో తమ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. చివరి దశ తాము అనుకున్న విధంగా సాగలేదని, విక్రమ్ ల్యాండర్ తో సంబంధాల పునరుద్ధరణకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని తెలిపారు.

More Telugu News