Narasimhan: ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరిన నరసింహన్... ఘనంగా వీడ్కోలు పలికిన కేసీఆర్

  • గవర్నర్ గా ముగిసిన నరసింహన్ ప్రస్థానం
  • ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికిన కేసీఆర్
  • అంతకు ముందు ప్రగతి భవన్ లో ఘన సత్కారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మొత్తం 9 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగిన నరసింహన్ ప్రస్థానం ముగిసింది. నేటితో ఆయన పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవన్ లో ఆయనను ఘనంగా సన్మానించింది. కాసేపటి క్రితం హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత నగరమైన చెన్నైకు ఆయన బయల్దేరారు.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, తెలంగాణ గవర్నర్ గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Narasimhan
Governer
Telangana
KCR

More Telugu News