Ajit Dhoval: ఆపిల్ ట్రక్కులను అడ్డుకోలేరా?.... లేకపోతే గాజులు పంపమంటారా?: పాకిస్థాన్ కోడ్ భాషను పసిగట్టిన అజిత్ దోవల్

  • సరిహద్దు పొడవునా పాక్ సిగ్నల్ టవర్లు
  • రహస్య సంకేతాలతో సంభాషించుకుంటున్న ఉగ్రవాదులు
  • ఆయుధాలు పంపాలని కోరుతున్నారని వెల్లడించిన దోవల్

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం కోడ్ భాష ఉపయోగిస్తోందని, తాము ఆ సంకేతాలను గుర్తించామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఆపిల్ ట్రక్కులు ఆటంకాలు లేకుండా ఎలా ముందుకెళుతున్నాయి? వాటిని మీరు అడ్డుకోలేరా? లేకపోతే గాజులు పంపమంటారా? అంటూ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ కు రహస్య సంకేతాలతో కూడిన సంభాషణలు నడుస్తున్నాయని వెల్లడించారు. సరిహద్దు పొడవునా 20 కిమీ పరిధిలో పాకిస్థాన్ కు చెందిన సిగ్నల్ టవర్లు ఉన్నాయని, వాటిద్వారా కశ్మీర్ లోని తమ వారికి సందేశాలు పంపుతున్నట్టు అర్థమవుతోందని అన్నారు. ఆయుధాలు, ఇతర సరంజామా పంపాలని ఉగ్రవాదులు కోరుతున్నట్టుగా భావిస్తున్నామని దోవల్ వివరించారు.

More Telugu News