నాకు దేశభక్తి ఎక్కువ.. అందుకే బీజేపీలో చేరుతున్నా!: టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి

07-09-2019 Sat 13:12
  • నాకు దేశభక్తి ఎక్కువ.. బీజేపీలో చేరబోతున్నా
  • అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా
  • టీడీపీ అభ్యర్థుల ఎంపిక సరిగా సాగలేదు

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించారు. తనకు దేశభక్తి ఎక్కువనీ, కడప జిల్లా అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. తెలుగుదేశం నుంచి తనతో పాటు బీజేపీలో ఇంకా ఎవరు చేరుతారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. బీజేపీలో ఎప్పుడు చేరాలన్న విషయమై అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

ఇక గత ఎన్నికల్లో కడప లోక్ సభ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీనిపై ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ.. జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సరిగా సాగలేదని విమర్శించారు. అందువల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానని స్పష్టం చేశారు.