Crime News: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

  • బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ మల్లికార్జున నగర్‌లో కలకలం
  • బురఖాలు, ముసుగు ధరించి వచ్చి దాడి
  • కారణం తెలియక ఆశ్చర్యపోతున్న బాధితురాలు
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి దాడి చేయడం స్థానికంగా కలకలానికి కారణమైంది. హైదరాబాద్‌లోని బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ మల్లికార్జున నగర్‌లో చాపల కృష్ణ, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. కృష్ణ  డ్రైవర్‌గా పనిచేస్తుండగా, లక్ష్మి ఇంట్లో కుట్టుపని చేస్తూ కొంత ఆదాయాన్ని వెనకేస్తోంది.

 విధుల్లో భాగంగా భర్త బయటకు వెళ్లగా నిన్న లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరు బురఖా, ఒకరు మాస్క్‌ ధరించిన వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. లక్ష్మిపై దాడి చేశారు. ఈ హఠాత్పరిణామంతో విస్తుపోయిన లక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అయితే అప్పటికే దాడిచేసిన వ్యక్తులు పారిపోయారు. ఈ సందర్భంగా లక్ష్మి తమకు ఎవరితో ఎటువంటి గొడలు లేవని, ఎవరీ పనికి పాల్పడ్డారో అర్థం కావడం లేదని వాపోయింది. దీంతో ఇది ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు.
Crime News
lady attecked
three members

More Telugu News