Ramyakrishna: జయలలితగా రమ్యకృష్ణ ఫస్టులుక్

  • వెబ్ సిరీస్ గా జయలలిత బయోపిక్
  • ఆల్రెడీ మొదలైపోయిన షూటింగ్  
  • త్వరలోనే ప్రకటించనున్న విడుదల తేదీ

వెండితెర కథానాయికగా .. సాహసోపేతమైన రాజకీయ నాయకురాలిగా జయలలిత జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు .. ఎన్నో అవమానాలు .. మరెన్నో విజయాలు వున్నాయి. ఈ కారణంగానే ఆమె బయోపిక్ ను రూపొందించడానికి పలువురు దర్శక నిర్మాతలు రంగంలోకి దిగారు. ఒక బయోపిక్ లో కంగనా .. మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను 'క్వీన్' టైటిల్ తో వెబ్ సిరీస్ గా అందించడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ తొలి ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ షూటింగు మొదలైపోయింది. ఈ వెబ్ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి రమ్యకృష్ణ ఫస్టులుక్ ను విడుదల చేశారు. జయలలితగా ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News