KCR: యాదాద్రి గుడిపై కేసీఆర్ బొమ్మలు... వివరణ ఇచ్చిన ఆలయ అధికారి కిషన్ రావు

  • యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మలపై విపక్షాల ఆగ్రహం
  • ఆలయాల్లో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా బొమ్మలు చెక్కడం సహజమేనన్న అధికారి
  • కేసీఆర్ బొమ్మలు చెక్కాలని శిల్పులకు తాము చెప్పలేదంటూ స్పష్టీకరణ

ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రిలో ఆలయ గోడలపైనా, స్తంభాలపైనా సీఎం కేసీఆర్, కారు బొమ్మలు చిత్రించడం వివాదాస్పదమైంది. ఆలయ శిలలపై కేసీఆర్ బొమ్మలేంటని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై యాదాద్రి ఆలయ ప్రత్యేక అధికారి కిషన్ రావు వివరణ ఇచ్చారు. ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనని చెప్పుకొచ్చారు. అహోబిలం పుణ్యక్షేత్రంలో నెహ్రూ, గాంధీ బొమ్మలున్నాయని వివరించారు.

అయితే, ప్రత్యేకంగా ఫలానా బొమ్మలు చెక్కాలని తాము శిల్పులకు చెప్పలేదని, ఎవరి బొమ్మలు చెక్కాలనేది శిల్పుల ఇష్టమని తెలిపారు. కేవలం బాహ్య ప్రాకారంలోనే ఈ బొమ్మలున్నాయని, ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కిన బొమ్మలు కావని కిషన్ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కోసమే చెక్కించామని అనడం సరికాదని అన్నారు. వీటిపై అభ్యంతరాలు వస్తే మార్పులు చేస్తామని అన్నారు.

More Telugu News