Ram: తదుపరి సినిమా విషయంలో ఆలోచనలో పడిన రామ్

  • 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టిన రామ్ 
  • తదుపరి సినిమా కిషోర్ తిరుమలతో 
  • మాస్ కి నచ్చే అంశాలపై దృష్టిపెట్టిన రామ్
కథల విషయంలోను .. పాత్రల విషయంలోను .. తన లుక్స్ విషయంలోను కొంత కాలంగా రామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ తో 'ఇస్మార్ట్ శంకర్' చేస్తున్నప్పుడే ఆయన కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తరువాత 'ఇస్మార్ట్ శంకర్'కి మాస్ ఆడియన్స్ అంతా కలిసి హిట్ ను కట్టబెట్టేశారు. దాంతో ఆ మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్ వున్నాడు.

అందువల్లనే ముందుగా అనుకున్న కథకి కాస్త మాస్ టచ్ ఇవ్వమని కిషోర్ తిరుమలకి రామ్ చెప్పాడని అంటున్నారు. అయితే కిషోర్ తిరుమల స్టైల్ వేరు .. ఆయన యూత్ కి నచ్చే ప్రేమకథలనే ఎక్కువగా తీస్తూ వస్తున్నాడు. ఆ సినిమాలే ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి కూడా. అందువలన మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలను జోడించడం తన వలన కాదని ఆయన చెప్పడంతో, రామ్ ఆలోచనలో పడ్డాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.
Ram
Kishore Tirumala

More Telugu News