ISRO: ఇప్పటివరకు జరిగిన ప్రయాణం ఒకెత్తు... చివరి 15 నిమిషాలు మరోఎత్తు: చంద్రయాన్-2పై స్పందించిన ఇస్రో చైర్మన్

  • అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టనున్న విక్రమ్ ల్యాండర్
  • అంతా సవ్యంగానే జరుగుతోందన్న ఇస్రో చైర్మన్
  • చివరి 15 నిమిషాల్లో ఎంతో సంక్లిష్ట ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడి

మరికొన్ని గంటల్లో జాబిల్లిపై చంద్రయాన్-2 అడుగుపెట్టనున్న కీలక తరుణంలో ఇస్రో చైర్మన్ శివన్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు జరిగిన ప్రయాణం ఒకెత్తయితే, విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే చివరి 15 నిమిషాలు అత్యంత కీలకం అని వెల్లడించారు.

ఇప్పటివరకు ప్రణాళిక ప్రకారం అంతా సవ్యంగానే జరిగిందని, చారిత్రక ఘట్టం కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. చివరి 15 నిమిషాల్లో ఎన్నో సంక్లిష్టమైన ప్రక్రియలు నిర్వహించాల్సి ఉందని, ప్రతి క్షణం విలువైనదేనని తెలిపారు. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఇది అత్యంత చిరస్మరణీయమైన రోజు అవుతుందని ఉద్ఘాటించారు.

చంద్రయాన్-2 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల నుంచి 2.30ధ్య గంటల మధ్య చంద్రుడిపై కాలుమోపనుంది. అనంతరం దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది.

More Telugu News