YS Viveka: వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చండి: జగన్ ఆదేశాలు

  • ఇంకా ఓ కొలిక్కి రాని వివేకా హత్య కేసు విచారణ
  • కడపలో మకాం వేసిన డీజీపీ
  • నేడు సిట్ బృందంతో భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకు జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. హత్య కేసును త్వరగా తేల్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కడపలో మకాం వేశారు. కేసు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందంతో ఈరోజు ఆయన భేటీ కానున్నారు.
YS Viveka
Jagan
Murder
AP DGP

More Telugu News