Jurala: జూరాలకు భారీ వరద... ఆరు గేట్లు ఎత్తివేత!

  • మరోసారి పొంగుతున్న కృష్ణమ్మ
  • జూరాలకు 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ మరోసారి పొంగి పొరలుతోంది. ఈ ఉదయం జూరాల జలాశయం ఆరు గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను, శ్రీశైలానికి వదులుతున్నారు. సాయంత్రానికి జూరాలకు వస్తున్న వరద మరింతగా పెరగవచ్చని, అన్ని గేట్లనూ ఎత్తాల్సి వస్తుందని అంచనా వేస్తున్నామని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం జూరాలకు వస్తున్న ఇన్ ఫ్లో 32 వేల క్యూసెక్కులుగా ఉండగా, అందులో సుమారు 15 వేల క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతూ, మిగతా నీటిని వివిధ కాలువలకు పంపుతున్నారు. జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉంది. శ్రీశైలంలో నీటిమట్టం 879 అడుగులకు పైగా ఉంది.
Jurala
Krishna River
Gates
Flood

More Telugu News