Jagan: పాస్టర్లకు గౌరవ వేతనం కోసం ప్రభుత్వ నిధులతో సర్వేనా?: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ మండిపాటు

  • అన్ని మతాల్లోనూ పేదలు ఉన్నారు
  • జగన్ విధానాలు ఓ మతానికే అనుకూలంగా ఉన్నాయి
  • తన ఎజెండా ఏంటో జగన్ బయటపెట్టాలి
పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ మండిపడ్డారు. వారికి గౌరవ వేతనం ఇవ్వడానికి ప్రభుత్వ నిధులతో సర్వే చేయించడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయన్న ఆయన.. ప్రభుత్వ విధానాలు ఓ మతానికే అనుకూలంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాల్లోనూ పేదలు ఉన్నారని, కానీ వారందరినీ విస్మరించి కేవలం పాస్టర్లకే నెలకు రూ.5 వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అసలింతకీ జగన్ అసలైన ఎజెండా ఏంటో చెప్పాలని దేవ్‌ధర్ డిమాండ్ చేశారు.
Jagan
BJP
Andhra Pradesh
sinil devdhar

More Telugu News