vizianagaram: ఆత్మహత్యాయత్నం... రైలు నుంచి దూకేసిన ప్రేమజంట!

  • స్వల్ప గాయాలతో బయటపడిన జంట
  • విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసుల ఆరా
విజయనగరం జిల్లా నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించి గాయాలతో బయటపడింది. రైలెక్కిన ప్రేమ జంట నెల్లిమర్ల సమీపంలో రైలు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, స్టేషన్ సమీపిస్తుండడంతో రైలు వేగం తగ్గింది. దీంతో యువతీయువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్య పడి గాయాలతో బాధపడుతున్న ఇద్దరినీ గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 ప్రస్తుతం ఇద్దరూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యువతీయువకులది బలిజపేట మండలంలోని అరసాడ, ఇరువాడకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
vizianagaram
Nellimarla
lovers

More Telugu News