Andhra Pradesh: ఎల్.రమణ ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి!: బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు

  • నేడు ఎల్.రమణ పుట్టినరోజు
  • టీడీపీ నేతకు చంద్రబాబు శుభాకాంక్షలు
  • ఆయనకు తెలంగాణ ప్రజల ఆశీస్సులుండాలని ఆకాంక్ష

తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రమణ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఆయన ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News