Andhra Pradesh: డాక్టర్ గా మారిన స్వీపరమ్మ.. కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రిలో విచిత్రం!

  • పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • ఓ డాక్టర్ సెలవులో, మరో డాక్టర్ కు బద్ధకం 
  • మీడియా ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం

రోగాలు వస్తే నిరుపేదలు, గ్రామీణ ప్రజలు ఆశ్రయించే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి అడ్డాలుగా మారుతున్నాయి. రోగులకు చికిత్స అందించేందుకు బద్ధకిస్తున్న వైద్యులు.. ఆసుపత్రిలోని స్వీపర్లతో వైద్య సేవలు అందజేస్తున్నారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉండగా, ఒకరు సెలవుపై వెళ్లారు. దీంతో ఆసుపత్రిలోని మహిళా స్వీపర్ రోగులకు ప్రస్తుతం వైద్య సేవలు అందజేస్తున్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రహేలా సమక్షంలో రోగులకు ఎమర్జెన్సీ సేవలు, సెలైన్ ఎక్కించడం, ఇంజెక్షన్ ఇవ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా గుర్తించి డాక్టర్ ను నిలదీయగా..‘రోగులకు ఏమైనా జరిగితే నాదే బాధ్యత. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా ఆమె సాయం తీసుకుంటున్నాం’ అని జవాబిచ్చారు.

More Telugu News