Madhya Pradesh: ప్రియుడితో పారిపోయిన యువతి.. పట్టుకొచ్చి ఊరంతా అర్ధనగ్నంగా ఊరేగించిన కుటుంబసభ్యులు!

  • మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో ఘటన
  • వేరే తెగకు చెందిన యువకుడితో యువతి ప్రేమ
  • ఇళ్ల నుంచి పారిపోయిన జంట

కులం కట్టుబాట్ల శిక్షకు ఓ అమ్మాయి గురైంది. కుమార్తె ప్రియుడితో పారిపోవడంతో కోపంతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను పట్టుకొచ్చి చితకబాదారు. అనంతరం అర్థనగ్నంగా ఊరంతా పరిగెత్తించి కొట్టారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తమాచీ గ్రామానికి చెందిన ఓ యువతి(19) మరో తెగకు చెందిన యువకుడిని ప్రేమించింది.

అయితే తమ వివాహానికి ఇరుకుటుంబాలు ఒప్పుకోవని భావించిన ప్రేమికులు, ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో కుమార్తె చర్యతో తమ పరువు పోయిందని భావించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఎలాగో ఆమెను ఇంటికి పట్టుకొచ్చారు. అనంతరం అర్థనగ్నంగా చేసి ఇంట్లోని వాళ్లంతా ఆమెను చావబాదారు. అలాగే కొడుతూ ఊరిలోని రోడ్ల వెంట తిప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, తమకు ఫిర్యాదు అందితేనే ఈ విషయంలో ముందుకెళ్లగలమని పోలీసులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News