Briton: వయసు పైబడినా చమత్కారాలకు లోటులేని బ్రిటన్ రాణి!

  • అమెరికన్ పర్యాటకులను ఆటపట్టించిన క్వీన్ ఎలిజబెత్-2
  • బ్రిటన్ రాణిని ఎప్పుడైనా కలిశారా? అంటూ బ్రిటన్ రాణినే అడిగిన అమెరికన్లు
  • తన బాడీగార్డ్ ను అడగాలంటూ అమెరికన్లతో రాణిగారి పరిహాసం

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దాదాపు పండు ముదుసలి అని చెప్పవచ్చు. ఆమె వయసు 93 సంవత్సరాలు. అయితేనేం, ఇప్పటికీ ఆమెలో హాస్య చతురతకు కొదవలేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. ఇటీవల కొందరు అమెరికన్ టూరిస్ట్ లు స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కోటను సందర్శించారు. కోటలో పలు ప్రదేశాలు చూసే క్రమంలో ఓ వయోవృద్ధురాలు వారికి ఎదురైంది. ఆమెను చూసిన అమెరికన్ పర్యాటకులకు మాట కలిపారు.

మీరు ఇక్కడివారేనా..? ఎప్పుడైనా బ్రిటన్ రాణిని కలిశారా? అంటూ ఆరా తీశారు. వాస్తవానికి వారు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కాదు... సాక్షాత్తు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2. అయితే, తాను ఎవరో తెలియక అమెరికన్లు అలా అడిగారని భావించిన రాణి గారు, అవునండీ, నేను కూడా బ్రిటన్ రాణిని ఎప్పుడూ చూడలేదు, కలవలేదు అంటూ కొంటెగా సమాధానమిచ్చారు. అంతేకాదు, అక్కడే ఓ పక్కన నిల్చున్న తన బాడీగార్డ్ ను చూపించి బ్రిటన్ రాణి ఎలా ఉంటుందో అతడికి తెలుసంటూ చమత్కరించారు.

దాంతో అమెరికన్లు ఆ బాడీగార్డ్ వద్దకు వెళ్లగా, వాళ్లకు మతిపోయే సమాధానం ఎదురైంది. మీరిప్పటివరకు మాట్లాడిన వ్యక్తే బ్రిటన్ రాణి అని చెప్పేసరికి అమెరికన్లు నోళ్లు తెరిచారు. ఈ ఘటన ఆ బాడీగార్డ్ కారణంగానే మీడియాకు వెల్లడైంది.

More Telugu News