వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల దూషణ.. నలుగురు టీడీపీ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు!
- తుళ్లూరు మండలం అనంతవరంలో ఘటన
- శ్రీదేవి వస్తే వినాయకుడు మైలపడతాడన్న టీడీపీ నేతలు
- నలుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు
ఏ1గా కొమ్మినేని శివయ్య, ఏ2గా కొమ్మినేని సాయి, ఏ3గా కొమ్మినేని రామకృష్ణ, ఏ4గా కొమ్మినేని బుజ్జిలపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.