Pawan Kalyan: ‘పావలా కల్యాణ్’ వివాదంపై వివరణ ఇచ్చిన హీరోయిన్ నికిషా పటేల్!

  • ఆ హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది
  • నేను పొరపాటున చూసుకోకుండా కొట్టేశాను
  • పవన్ అభిమానులు ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపాలి
ప్రముఖ హీరోయిన్ నికిషా పటేల్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున ‘పావలా కల్యాణ్’ అని హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేసి ఇబ్బందుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీన్ని గమనించిన పలువురు పవన్ అభిమానులు, నికిషాను ఓ రేంజ్ లో తిట్టిపోశారు. దీంతో ఈ వివాదంపై నికిషా పటేల్ స్పందించింది.

‘‘పావలా కల్యాణ్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. దాన్ని నేను సరిగ్గా చూసుకోకుండానే కొట్టేశాను. పవన్ కల్యాణ్ గారిని బాధపెట్టే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. ఆయనపై నాకు ప్రేమ, గౌరవం వున్నాయి. ఇప్పటికైనా మీడియా, పవన్ అభిమానులు శాంతిస్తారనీ, నన్ను ట్రోలింగ్ చేయడం ఆపేస్తారని కోరుకుంటున్నా. కొందరు ఇడియట్స్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్ లు తయారుచేసి వైరల్ చేస్తున్నారు. దానివల్ల నేను ఇబ్బందుల్లో చిక్కుకున్నా. నేను సోషల్ మీడియాను వదిలేస్తున్నా’ అని నికిషా పటేల్ ట్వీట్ చేసింది.
Pawan Kalyan
Jana Sena
PAWALA KALYAN
TROLLING
ACTRESS
NIKISHA PATEL
Twitter
EXPLANATION

More Telugu News