Andhra Pradesh: ఎన్నికలప్పుడు గుర్తుకురాని టెక్నికల్ పాయింట్లు సీఎం జగన్ కు ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా?: నారా లోకేశ్

  • గోపాలమిత్రలు పాడిపరిశ్రమ అభివృద్ధికి సాయంచేశారు
  • దశాబ్దాలుగా వాళ్ల సేవలను వినియోగించుకున్నారు
  • ఇప్పుడు అర్హతలు లేవంటూ పక్కన పెట్టడం సరికాదు

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో జగన్ పలు హామీలు ఇచ్చారనీ, అప్పుడు గుర్తుకురాని టెక్నికల్ పాయింట్లు ఇప్పుడెందుకు గుర్తుకు  వస్తున్నాయని ప్రశ్నించారు. గోపాలమిత్రలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను జగన్ పరిశీలించాలని సూచించారు. ఇన్నాళ్ళూ రైతులకు సహాయకారులుగా ఉంటూ పాడి పరిశ్రమాభివృద్ధికి గోపాల మిత్రలు కృషి చేశారని లోకేశ్ తెలిపారు.

దశాబ్దాలుగా వాళ్ళ సేవలను ఉపయోగించుకుని ఇప్పుడు అర్హతలు లేవంటూ వాళ్ళను పక్కనపెట్టడం సరికాదని హితవు పలికారు. ఏళ్ళ కొద్దీ సేవచేసినా వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది లేకపోతే ఎలా? అని నిలదీశారు. గోపాలమిత్రల సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలనీ, లేదంటే తన మాటలు, హామీలకు విశ్వసనీయత లేదని ముఖ్యమంత్రి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్, ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

More Telugu News