Bigg Boss-3: బిగ్ బాస్-3... ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారి లిస్ట్!

  • గత వారం ఎలిమినేషన్ క్యాన్సిల్
  • ఈ వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి
  • వస్తూనే రవి, శ్రీముఖిలను నామినేట్ చేసిన శిల్ప
హోస్ట్ నాగార్జున గైర్హాజరు, వినాయక చవితి సెలబ్రేషన్స్ కారణంగా, గత వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరూ బయటకు రాలేదన్న సంగతి తెలిసిందే. నాగ్ స్థానంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, రెండు రోజుల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తికట్టించగా, ఈ వారం ఎలిమినేషన్ కు నామినేషన్స్ ను బిగ్ బాస్ ప్రకటించారు. వైల్డ్ కార్డ్ ద్వారా యాంకర్, నటి శిల్పా చక్రవర్తి హౌస్ లోకి ప్రవేశించింది.

 ఆమెకు ఇద్దరిని నామినేట్ చేసే శక్తిని బిగ్ బాస్ ఇవ్వగా, ఇప్పటివరకూ నామినేట్ కాని రవిని, స్ట్రాంగ్ గా ఉన్న శ్రీముఖిని ఆమె నామినేట్ చేసింది. వీరితో పాటు రాహుల్, మహేశ్, అలీలు ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. అంతకుముందు రాహుల్ ను అలీ, మహేశ్ ను రవి నామినేట్ చేశారు. ఇదే సమయంలో కెప్టెన్ గా ఉన్న వరుణ్ సందేశ్ అలీ, రవిలను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక ఈ వారంలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళతారో తెలియాలంటే, మరో ఐదు రోజులు వేచి చూడాల్సిందే.
Bigg Boss-3
Elimination
Nominations
Ravi
Srimukhi

More Telugu News