Omar Abdullah: నా స్నేహితుడు ఒమర్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని భావిస్తున్నా: పూజా బేడీ

  • ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేసి ఒక నెల గడిచిపోయింది
  • అతని నిర్బంధం ఇలాగే కొనసాగదు
  • ఏ సమస్యకైనా ఒక పరిష్కారాన్ని కనుగొనాలి
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని స్నేహితురాలు, సినీ నటి పూజా బేడీ స్పందించారు. తన స్నేహితుడు, బ్యాచ్ మేట్ ఒమర్ అబ్దుల్లాను విడుదల చేయాలని కోరింది. 'ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేసి ఒక నెల గడిచిపోయింది. అతను నా బ్యాచ్ మేట్, నా కుటుంబ మిత్రుడు' అని ట్వీట్ చేసింది. ఒమర్ గృహ నిర్బంధం ఇలాగే కొనసాగదని... అతన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఏ సమస్యకైనా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అన్నారు. 
Omar Abdullah
Pooja Bedi
Bollywood
National Conference
Jammu And Kashmir

More Telugu News