New Delhi: ఢిల్లీలో దారుణం.. మెట్రో రైలు వస్తుండగా దూకి మహిళ ఆత్మహత్య

  • ప్లాట్‌ఫాంపై వేచి చూసిన మహిళ
  • రైలు రావడంతో దాని కిందికి దూకి ఆత్మహత్య
  • ఆమె వివరాలు తెలియరాలేదన్న పోలీసులు
ఢిల్లీలోని ఝందేవాలన్ మెట్రో రైలు స్టేషన్‌లో దారుణం జరిగింది. ప్లాట్‌ఫాంపై వేచి చూస్తున్న 40 ఏళ్ల మహిళ స్టేషన్‌‌లోకి రైలు ప్రవేశిస్తున్న సమయంలో దాని కిందికి దూకి ప్రాణాలు తీసుకుంది. సోమవారం జరిగిందీ ఘటన. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందికి ఓ మహిళ దూకిందని ఫోన్ వచ్చిందని, వెళ్లి చూసేసరికే ఆమె ప్రాణాలు పోయాయని పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలియరాలేదని, పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
New Delhi
metro rail
suicide
woman

More Telugu News